Friday 10 January 2014

Narada Bhakti Sutralu...60, 82





60వ సూత్రం:- శాంతి రూపాత్ పరమానంద రూపాచ్చ
శాంతి, పరమానందం అనేవి భక్తియొక్క సహజ లక్షణాలు. ముందు సూత్రంలో నారదులవారు భక్తికి వేరే ప్రమాణమేదీ అవసరం లేదని, అది స్వయం ప్రమాణమని చెప్పి, దానిని సమర్థిస్తూ అది శాంతి, పరమానంద స్వరూపం అని తెలియజేసారు.
        మనసులో భక్తి పూర్ణంగా ఉన్నప్పుడు ఇంకేమి ఉండలేవు. భగవంతుని విస్మరణ లేకుండా ఉండుటే శాంతి. భక్తి, కలతలు మనసులో కలిసి ఉండలేవు. స్వచ్ఛమైన ప్రేమలో ప్రశాంతత, ఆనందం తప్ప వేరే దేనికీ తావులేదు. లోపలా, బయటా శాంతే! భక్తుడు భగవంతుని ధ్యానిస్తున్నప్పుడు కూడా ఇదే అనుభూతి కలుగుతుంది. ఇదే నిజమైన భక్తికి ప్రతిఫలము. భక్తి వర్ణనాతీతం. స్వభావతః పరమానందమని, ప్రశాంతతనిస్తుందని మాత్రమే చెప్పగలం. అంతకన్నా వర్ణించలేము. అది ఒక అనుభూతి, భావన మాత్రమే.
     శాంతి అంటే విస్మరణ లేకుండా ఉండుట. ఎక్కడైతే పూర్ణమయిన స్వేచ్ఛ ఉంటుందో అదే ఆనందం. భక్తి పరాధీనతలో ఉండదు. దేహము కూడా పరమే. దాన్ని పట్టుకుంటే దుఃఖమే మిగులుతుంది. విడిగా చూస్తే ఆనందం.
82వ సూత్రం:- గుణమాహాత్మ్యాసక్తి రూపాసక్తి పూజాసక్తి స్మరణాసక్తి దాస్యాసక్తి సఖ్యాసక్తి వాత్సల్యాసక్తి కాంతాసక్తి ఆత్మనివేదనాసక్తి తన్మయతాసక్తి పరమ విరహాసక్తి రూపా ఏకధా అపి, ఏకాదశధాభవతి     
ఆసక్తి :- ఇక్కడ ఆసక్తి అంటే వ్యక్తులయందు, సంసారమునందు ఆసక్తి కాదు. ఆసక్తి పరమాత్మయందు వ్యక్తపరచే పూర్ణాసక్తి అయి ఉండాలి. ఇవన్నీ భక్తి ప్రకటితమయ్యే వివిధ సమాంతర రూపాలు. వీటి గతిలో హెచ్చుతగ్గులున్నా, అందరూ త్వరితంగా భక్తి, జ్జాన మార్గాలలో ముందుకుసాగడానికి ఉపయుక్తమవుతాయి.
గుణమాహాత్మ్యాసక్తి:- సాధకునికి ఈ తరహా ఆసక్తియందు భగవంతుని గుణాలను, మహిమలను పొగుడుటయందు, కీర్తించుటయందు ఆసక్తి ఉంటుంది. నారదులవారు, వ్యాసమహర్షి, శుకమహర్షి, పరీక్షిన్మహారాజు, రాజాపృధు, సుఖయోగీంద్రులు మొదలగువారు అనుసరించిన మార్గం ఈ రకమైనదే. గుణములని కీర్తించడం వల్ల, ప్రేమించడం వల్ల భక్తి సాధ్యమవుతుంది. ఇష్టం లేకపోయినా గుణాలని ఆసక్తిగా ఎప్పుడైతే వింటామో, గుణమాహాత్మ్యాం అనే త్రాడుతో పరమాత్మకి దగ్గరవుతాము. అప్పుడు రూపాన్ని చూడాలనే ఆసక్తి దానంతట అదే కలుగుతుంది. మనసు రుచి పరమాత్మ మీదే ఉండాలి. అది ఎలా ఉండాలంటే అన్యం ఏమీ లేక, సర్వం మరచిపోవాలి. నిత్య నిరంతరమూ భగవంతుని గుణములు,
మహిమలు, కథలయందు ఆసక్తి ఆ విధంగా ఉన్నప్పుడు సాధకుడు పరమాత్మకి దగ్గరవుతాడు.      
 ఆసక్తి :- ఇక్కడ ఆసక్తి అంటే వ్యక్తులయందు, సంసారమునందు ఆసక్తి కాదు. ఆసక్తి పరమాత్మయందు వ్యక్తపరచే పూర్ణాసక్తి అయి ఉండాలి. ఇవన్నీ భక్తి ప్రకటితమయ్యే వివిధ సమాంతర రూపాలు. వీటి గతిలో హెచ్చుతగ్గులున్నా, అందరూ త్వరితంగా భక్తి, జ్జాన మార్గాలలో ముందుకుసాగడానికి ఉపయుక్తమవుతాయి.
రూపాసక్తి:- భగవంతుని రూపాన్ని చూసి ముగ్దులు కావడం. ఇది మరొక రకమైన భక్తిమార్గం. గుణమాహాత్మ్యాసక్తి ఉండడం వల్ల అది రూపాసక్తిగా పరిణమిస్తుంది. తేజము యొక్క గుణమే రూపం. దాని ద్వారా రూపం కనిపిస్తుంది. పరమాత్మది సాధారణ సౌందర్యం కాదు. రూపాలు అనేకం. కానీ అన్ని రూపాలని చూసి మోహించడం జరుగదు. నరసింహ, మత్స్య అవతారాలు ఉదాహరణలు. కొన్ని రూపాల్లో ఉన్న పరమాత్మనే మోహిస్తాము. ఉదాహరణకు రామ, కృష్ణ మొదలైనవారు. రూపాసక్తిలో రూపాన్ని చూసి తన్మయత్వంలో ఉంటాం. చుట్టు ఏమి జరుగుతున్నా, మరచిపోతాం, పరిసరాలని కూడా మరచిపోతాం. మన మనస్సంతా భగవద్రూపం దాల్చుతుంది. అంతటి తన్మయత్వం ఎందుకంటే సాక్షాత్ శక్తిని నడిపించే ఆ చైతన్యం యొక్క రూపమే ఇది కనుక అంత మోహం. అందుకే మనకు ఆనందం. మన శరీరం ప్రాకృతిక, భౌతిక రూపం. పంచ భూతాలతో తయారైనది, కాని భగవంతునిది చిన్మయ శరీరం దీనికి రూపం ఉంటుంది. పంచ తన్మాత్రాలతో తయారైనది అది. గుణాలు ఉండవు. భగవంతుడు నిర్గుణుడు, సచ్చిదానంద రూపం, ఘనీభూతమైనది. అందుకే మనందరికీ ప్రేమ. రాముణ్ణి చూసి శూర్పణఖ వంటి రాక్షస స్త్రీ సమేతం మోహానికి గురికావడం.
 పరమాత్మయందు ఆసక్తి కలిగి ఉండడమే నిజమైన అనాసక్తి అంటే. ఇది మిగతా విషయ ప్రపంచం మీద ఆసక్తి లేకుండా చేస్తుంది. దేనికైనా ఒక ఆలంబన కావాలి. పరమాత్మనే ఆలంబనగా చేసుకోవడం వల్ల సచ్చిదానంద స్వరూపమే మనకు దక్కుతుంది. ఈ రకమైన ఆసక్తి ఉండడం వల్ల పరమాత్మకు దూరంగా ఉండలేము. రూపాసక్తిలో, ఏ స్థాయిలో ఉన్న భక్తునికైనా, పరమాత్మ సులభంగా లభ్యమవుతాడు.
పూజాసక్తి:- భగవంతుని భక్తితో నిరంతరం శాస్త్రోక్తంగా పూజ చేయడం. మనసులో ప్రేమ ఉండడం వల్ల, అది సేవ రూపంలో బయటకి వ్యక్తమవుతుంది. ఈ భావం అందరికి హృదయంలో ఉంటుంది కాని, అది వివిధ రూపల్లో వ్యక్తమవుతుంది. పూజకి రూపం అవసరం. దీనివల్లే అది బయటకి వ్యక్తమౌతుంది. రూపం వల్ల ఆకర్షితులమవుతాం. కనుక పూజ చేస్తాం. శ్రీరాముని పాదుకలను నిరంతరమూ పూజించిన భరతుడు, భక్త కన్నప్ప మొదలైన వారు ఈ కోవకు చెందినవారే.
        భావన మనసులో ఉన్నప్పుడు మాత్రమే మన మనస్సు, పరమాత్మతో అనుసంధానమవుతుంది. ఉ శివమానసిక పూజ. అసంగత్వానికి సరి అయిన నిర్వచనమేమిటంటే నిత్యమూ పరమాత్మయందు దృష్టి కలిగి, రూపంతో ఏకమై, పూజచేయడం, సేవ చేయడం. భగవంతుని రూపాన్ని, నామాన్ని పట్టుకోవడం వల్ల పరమాత్మని గూర్చి వ్యాకులత చెందడం వల్ల ఆయన్ని చేరుకోగలం. భగవంతుని పట్ల ఆస్తిక్యభావం, శ్రద్ధ, ప్రేమ ఉండడం వల్ల అన్నీ వస్తాయి.
స్మరణాసక్తి :- నిరంతరం భగవన్నామ స్మరణ ద్వారా భగవంతుని చేరుకోవడం. ప్రహ్లాదుడు, దృవుడు మొదలైన మహాభక్తులు. మనం నిరంతరమూ దేన్నైతే స్మరిస్తామో చివరకు దాన్నే చేరుతాము. అందుకే మనం ప్రయత్న పూర్వకంగానైనా, నిరంతరం మన మనసుని భగవంతుని మీద కేంద్రీకృతమయ్యేలా చూడాలి, నిరంతర స్మరణ వల్ల ఏ విపత్తులు మన దరిచేరవు. నా స్వరూపం నాకు తెలియబడుతుంది. అది పరమానంద స్వరూపం కాబట్టి. మోహం పోయి, స్మృతి వస్తుంది నీకు. స్మరణ ప్రేమలో ఉండడం వల్ల శాంతి, పరమానందాన్ని పొందుతాం. ఆయన్ని విస్మరించడం వల్లే ఈ విపత్తులన్నీను. అహంకారం, రాగం ద్వేషం అన్నీ భగవన్నామ కలుగుతాయి ఆ సమయంలో. అసలైన స్మరణాసక్తి అంటే (అది వుంటే) దాన్ని అణచివేయడం
కష్టం. స్మరణ నిత్యనిరంతరమూ చేయడం వలన దుఃఖం రాదు, పరమానందాన్ని పొందుతాం. స్మరణ అయిదు నిమిషాలు చేసినా దానిలో గాఢత, పూర్ణత ఉండాలి. దేనియందు ప్రేమ, రుచి, ఆసక్తి ఉంటే దానినే ఎవరైనా స్మరిస్తాం. అప్పుడే ఏదో రూపంలో సేవ చేయాలనే భావన కలుగుతుంది.
దాస్యాసక్తి:- వినయ విధేతలతో దాసునిగా, మాటమీరకుండా భగవంతుని సేవించడం. ఉ హనుమంతుడు, విదురుడు మొదలైన వారు. ఈ సేవలో ఆనందాన్ని కోరుకోకూడదు. సేవకుడు, సేవికా భావం ఉండకూడదు. నేను ఇంకా పూర్ణంగా సేవ చెయలేదే అనే భావన కలుగుతుంది దాసుడిలో ఇక్కడ. అసలైన దాసుడు తన స్వామియొక్క గొప్పతనాన్ని నలుదిక్కులా పాకేలా చేస్తాడు. అందరికన్నా నేనే అల్పుడను అనే భావం కలవాడే నిజమైన దాసుడు. అప్పుడు స్వామి కూడా తన సఖుడిగా చూస్తాడు నిన్ను.
సఖ్యాసక్తి:- భగవంతుణ్ణే తన స్నేహితుడిగా కలిగి ఉండడం. అర్జునుడు, కుచేలుడు ఈ రకపు భక్తులు. అసలైన స్నేహితుడంటే, తనకు ఎంత ముఖ్యమైన పని ఉన్నా, అది వదిలి, స్నేహితుని పని చేయడం; ఎప్పుడూ సంతుష్టునిగా ఉండడం; తన సర్వస్వంపై స్నేహితుడు పూర్ణ అధికారాన్ని, స్వతంత్రాన్ని కలిగి ఉండడం; స్నేహితుని నిరంతరం దర్శించాలని, మాట్లాడాలని వ్యాకులత కలగడం అసలైన సఖ్యత్వానికి నిదర్శనము. అప్పుడు పరమాత్మ మనకి దాసుడిగా, సఖుడిగా మారిపోతాడు.
వాత్సల్యాసక్తి:- తల్లిదండ్రులకు వారి పిల్లలపై ఉండే ప్రేమ వంటి భక్తే ఈ వాత్సల్యాసక్తి. ఉ దేవకి, యశోద, కౌసల్య, విష్ణుచిత్తుడు మొదలైనవారు. ఇది అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. ఇందులో ఎప్పుడూ ఇవ్వడమే ఉంటుంది. తీసుకోవడం ఉండదు. తిరిగి ఏమీ ఆశించరు. భయం ఉండదు. అలాగే దాచుకోవడం కూడా ఏమీ ఉండదు. ఇటువంటి స్థితిలో భగవంతుడు కూడా ఏమీ చేయలేక భక్తుడు చెప్పినట్లే వింటాడు.

No comments:

Post a Comment